గజ్వేల్: కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం పురస్కరించుకుని మర్కుక్ పంప్ హౌస్ వద్ద సుదర్శన యాగం నిర్వహించారు. త్రిదండి చిన జీయర్ స్వామితో కలిసి సీఎం కేసీఆర్ దంపతులు పూర్ణహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
పూర్ణాహుతి తరువాత జీయర్ స్వామితో కలిసి మర్కుక్ పంప్ హౌస్ కు స్విచ్ ఆన్ చేసి కొండపోచమ్మ సాగర్ లోకి గోదావరి జలాలను వదులుతారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, ఇద్రకరణ్రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.