FbTelugu

కేసులు తగ్గుముఖం… కాశ్మీర్ టూర్ రెడీ

శ్రీనగర్: సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుముఖం పట్టడం, పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేయడంతో పర్యాటకుల కోసం కాశ్మీర్ అందాలు కనువిందు చేయనున్నాయి. జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం పర్యాటకల కోసం ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నది.

పర్యాటక రంగంలో ఉన్న గైడ్ లు, డ్రైవర్లు, పర్యాటక సిబ్బందికి వ్యాక్సిన్లు వేయిస్తున్నారు. కరోనా మార్గదర్శకాలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. శ్రీనగర్ దాల్ లేక్ చుట్టూ ఉన్న హౌస్ బోటు ఓనర్లు, హోటల్ యజమానులు, సిబ్బంది, రెస్టారెంట్ సిబ్బంది, ట్రావెల్ ఏజెన్సీలకు వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. సోన్ మార్గ్, దూద్ పత్రి, యుస్మార్, పహల్ గాంవ్, గుల్ మార్క్ లలో వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.