FbTelugu

పాక్ ప్రజలకు ‘కశ్మీర్’ సమస్యే కాదట

Kashmir-is-not-a-problem-for-the-people-of-Pakistan

జమ్ము కశ్మీర్ విషయంలో భారత్ తీసుకునే ప్రతి నిర్ణయంపై నానా హంగామా చేస్తూ.. నిత్యం భారత్ వ్యాఖ్యలు చేస్తూ.. దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేసే పాకిస్థాన్ కు ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. అసలు పాకిస్థాన్ ప్రజల సమస్య కశ్మీర్ కానేకాదని వారు తేల్చి చెప్పారు. కుదేలవుతున్న తమ దేశ ఆర్థిక వ్యవస్థనే ప్రధాన సమస్య అని వారు తేల్చేశారు. తాజాగా పాకిస్థాన్ లో ‘గాలప్ ఇంటర్నేషనల్’ అనే సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో అక్కడి మెజార్టీ ప్రజలు ఈ మేరకు తమ అభిప్రాయాలను వెల్లడించారు. దేశ ఆర్థిక సంక్షోభమే పెను సమస్య అని 53 శాతం మంది పాక్ ప్రజలు తెలపగా.. రాజకీయ అస్థిరతపై కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం 8 శాతం మంది ప్రజలు మాత్రమే కశ్మీర్ ను ఒక సమస్యగా చూస్తున్నారట.

You might also like