FbTelugu

భక్తజనంతో పోటెత్తిన శైవక్షేత్రాలు

/Karthika-Masam-Celebrations-done-devoties

కడప: కార్తీక మాసంలో మొదటి సోమవారం కావడంతో శైవక్షేత్రాలు భక్తజనంతో పోటెత్తుతున్నాయి. ముఖ్యంగా మహిళలు పిండి, ఉసిరి, వివిధ రకాల ప్రమిదలతో దీపాలను వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. పరమశివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కావడంతో అభిషేకాలు ప్రత్యేక పూజలును ఆలయ అర్చకులు చేస్తున్నారు. నదీ తీరాన పుణ్య స్నానాలు చేసి దీపాలను నీటిలో వదులుతున్నారు.

You might also like