FbTelugu

కార్తీ ‘దొంగ’ గా రాబోతున్నాడు

ఖైదీ లాంటి ఎమోషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చి ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకుంటున్న యాంగ్రీ హీరో కార్తీ ఇప్పుడు దొంగ గా రాబోతున్నాడు. వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ పతాకాలపై జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దొంగ’ ఫస్ట్ లుక్ ను ఇటీవలే హీరో సూర్య, టీజర్ ని కింగ్ నాగార్జున రిలీజ్ చేయగా ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు సెకండ్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో హీరో కార్తీ వదిన, హీరో సూర్య సతీమణి జ్యోతిక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా హీరో కార్తీ మాట్లాడుతూ, ” ‘దొంగ’ నా కెరీర్ లో మరో విభిన్న చిత్రం. వెరైటీ చిత్రాలని ఆదరించే ప్రేక్షకులు ఈ సినిమాని కూడా బాగా రిసీవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. దొంగ లో యాక్షన్ తో పాటు ఎమోషన్ కి అందరూ కనెక్ట్ అవుతారు. మా వదిన గారు జ్యోతిక ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే సత్యరాజ్ గారు మరో ముఖ్య పాత్ర లో నటిస్తున్నారు. నా కెరీర్ లో మరో మెమొరబుల్ ఫిలిం.” అన్నారు

You might also like