FbTelugu

భారీగా పట్టుబడిన కర్ణాటక మద్యం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మద్యం ధరలు పెంచి ఆంక్షలు కఠినతరం చేసిన తర్వాత.. ఏపీలోకి అక్రమ మద్యం రవాణా రోజురోజుకి ఎక్కువైపోతోంది. తాజాగా కర్ణాటక నుంచి ఏపీకి అక్రమంగా తరలిస్తున్న మద్యం భారీ మొత్తంలో అధికారులకు పట్టుబడింది.

రాయలసీమలో తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ మినీ ట్రాలీ వాహనంలో భారీ మొత్తంలో మద్యం తరలిస్తున్న కొందరు దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంబంధిత వాహనాన్ని సీజ్ చేశారు. పలువురిపై కేసు నమోదు చేశారు.

You might also like