FbTelugu

ఇంజనీర్ రాస్కెల్…: కర్ణాటక మంత్రి భగ్గు

బెంగళూరు: విచక్షణ కోల్పోయిన ఒక మంత్రి ఇంజనీరు ను పరుష పదజాలంతో తిట్ల దండకం అందుకున్నారు. మంత్రి ఆగ్రహాన్ని చూసిన అధికారులు ఆందోళనకు గురయ్యారు.

తుమకూరు లో కర్ణాటక డెవలప్ మెంట్ ప్రోగ్రాం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో న్యాయ శాఖ మంత్రి జెసీ. మధుస్వామి ఇంజనీర్ ను తీవ్రంగా దూషించారు. టెండర్లు పిలిచినా పనులు ఎందుకు జాప్యం చేస్తున్నారని జెడ్పీ ఇంజనీర్ రంగస్వామిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు అప్పగించాలని నేను 4వ తేదీనే చెప్పాను, ఇప్పటి దాకా ఏం చేస్తున్నావంటూ మండిపడ్డారు. రాస్కెల్… ఎగిరి తంతే ఎక్కడ పడతావో తెలుసా అని ఊగిపోయారు.
పని చేయకుండా గాడిదలు కాస్తున్నావా వెధవ, నీ భార్య బట్టలు ఉతకాడినిక ఏ సబ్బులు కొంటున్నావు అంటూ తిట్టడంతో సమావేశంలో ఉన్న ఇతర అధికారులు గాబరాపడ్డారు. ఇలా పనిచేయని అధికారులను సస్పండ్ చేసి ఇంటికి పంపించాలని జెడ్పీ సీఈఓ ను మంత్రి మధుస్వామి ఆదేశించారు. గతేడాది మే నెలలో కోలార్ జిల్లాలో ఇదే విధంగా మంత్రి ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను దూషించారు. ఏయ్ ఏందే.. నోర్మూసుకో అంటూ గద్దించారు. దీనిపై సీఎల్పీ నాయకుడు కె.సిద్ధరామయ్య స్పందించారు. వెంటనే మంత్రి మధుస్వామిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.