FbTelugu

అండర్ వేర్, బ్రా లపై కన్నడ చిహ్నం

బెంగళూరు: పాపం కర్ణాటక రాష్ట్ర వాసులకు వరుసబెట్టి అవమానాలు ఎదురవుతున్నాయి. అత్యంత సున్నిత మనస్థత్వం కల రాష్ట్రవాసుల మతృభాష ను ఇటీవలే గూగుల్ అవమానించింది.
గూగుల్ సంస్థ బహిరంగ క్షమాపణలు కోరడంతో వివాదం సద్దుమణిగింది. మళ్లీ వెంటనే లో దుస్తులపై కన్నడ రాష్ట్ర అధికారిక చిహ్నం, పతాకం రంగులు ముద్రించారు. ఈ లో దుస్తులను అమెజాన్ ఆన్ లైన్ ఈ కామర్స్ సంస్థ విక్రయిస్తోంది.

కన్నడిగులు ఆత్మాభిమానం దెబ్బతినేలా ఉన్న వీటిని విక్రయించడంపై ప్రజలు ఆగ్రహంతో కుతకుతలాడుతున్నారు. కన్నడ భాష అధికార ప్రాధికార సంస్థ అధ్యక్షుడు టిఎస్.నాగాభరణ అమెజాన్ ఈ కామర్స్ పై భగ్గుమన్నారు. కన్నడ ప్రజలను ఘోరంగా అవమానించేలా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి అరవింద లింబాళి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. గూగుల్, అమెజాన్ సంస్థలు కన్నడిగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. వాటిని వెంటనే తొలగించి ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.