FbTelugu

కన్నడ నటి బ్లాక్ మెయిల్.. అత్యాచారం

బెంగళూరు: మత్తు మందు కలిపి ఒకసారి అత్యాచారం చేసి, ఆ తరువాత బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఒక కన్నడ నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నటి నుంచి ఫిర్యాదు తీసుకున్న జగ్జీవన్ రామ్ నగర పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జేజే నగర లోని ఒక అపార్ట్ మెంట్ లో నటి నివాసముంటున్నారు. 2018 లో గాంధీ బజార్ కాఫీ డే కు నటి వెళ్లగా, ఆ సమయంలో నాయండహళ్లికి చెందిన మోహిత్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు.

తను సీఈఓను అని పరిచయం చేసుకున్నాడు. పరిచయం పెరగడంతో నటిని తన కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్నాడు. 2019 జనవరిలోల ఫోటో షూట్ చేయించాడు. కంపెనీలో ఆర్థిక సమస్యలు అంటూ తొలలు రూ.1.5 లక్షలు తీసుకున్నాడు. ఆ తరువాత జూన్ నెలలో జేజే నగరలోని నటి ఇంట్లో తన జన్మదిన వేడుకలు నిర్వహించాడు.
జన్మదినం రోజు ముందు రాత్రి ఇద్దరూ కలిసి భోజనం చేశారు. ఆ తరువాత కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇవ్వడంతో మత్తులోకి జారుకున్నది. అత్యాచారం చేసి, ఆ దృశ్యాలను వీడియో తీశాడు. ఆ వీడియో చూపించి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అదే విధంగా తరచూ డబ్బులు అడిగేవాడు. ఇవ్వకపోతే సోషల్ మీడియలో పోస్టు చేస్తానని బెదిరించేవాడు. అలా మొత్తం రూ.20 లక్షల వరకు లాగాడు. డబ్బులతో పాటు పలుమార్లు అత్యాచారం చేసిన అతనిపై చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మోహిత్, తండ్రి మహదేవ్, తల్లి నాగవేణి, రాహుల్ పై కేసు నమోదు చేశారు.

You might also like