FbTelugu

కన్నా లక్ష్మీనారాయణ కోడలు మృతి

హైదరాబాద్: ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ కోడలు నల్లపురెడ్డి సుహారిక కొద్ది సేపటి క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

మాదాపూర్ లో ఉన్న తన స్నేహితురాలు మీనాక్షీ బాంబూ ను కలిసేందుకు ఆమె నివాసానికి వెళ్లారు. ఆమె నివాసంలోనే మాట్లాడుతుండగానే సుహారిక పడిపోయారు. వెంటనే ఆమెను గచ్చిబౌలి లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజీ) కి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు ప్రకటించారు. కన్నా కుమారు ఫణీంద్రను సుహారిక వివాహం చేసుకున్నారు. భార్యభర్తలిద్దరు కలిసి సునీంద్ర ఎంటర్ ప్రైజెస్ పేరుతో బిజినెస్ చేస్తున్నారు.

రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ విసి.సజ్జనార్ తెలిపారు.

suharika death

You might also like

Leave A Reply

Your email address will not be published.