FbTelugu

మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి: కన్నా

అమరావతి: విశాఖపట్నం ఫార్మాసిటీలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని బీజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఫార్మాసిటీ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు బిజెపి సంతాపం తెలియచేస్తోందని అన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం చేయించి వెంటనే నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.

You might also like