FbTelugu

22 నుంచి కాణిపాకం బ్రహ్మోత్సవాలు: జిల్లా కలెక్టర్

చిత్తూరు: కరోనా వైరస్ కారణంగా ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 11 వకు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా తెలిపారు.

కోవిడ్ నిబంధనలు అనుసరించి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని, ప్రతిరోజు పూజాది కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించాలని ఆలయ అధికారులను కోరారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే గ్రామోత్సవంను నిలిపివేసి, ఆలయ ప్రాకారంలోని వాహన సేవలు నిర్వహించాలని ఆయన సూచించారు. అయితే వినాయక చవితి రోజు మూడు వేల నుంచి నాలుగు వేల మందికి దర్శన భాగ్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా 60 ఏళ్ళు పైబడి 10 సంవత్సరాల లోపు ఉన్న చిన్న పిల్లలకు  దర్శన భాగ్యం లేదన్నారు.

You might also like