FbTelugu

గ్రేటర్ ఫలితాలపై కంగనా సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల సందర్భంగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బీజేపీ ఆధిక్యంలో కొనసాగడం పట్ల కంగన రనౌత్ ట్విట్టర్ లో పలు వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అన్నీ గందరగోళ పరిస్థితులే ఉన్నాయని అన్నారు. క్లిష్టమైన నగరాల్లో బీజేపీ ప్రజల హృదయాలను గెలుచుకుంటోందన్నారు. కాంగ్రెస్ నేతలు రోజంతా కంగనా.. కంగనా.. అంటూ తన పేరును జపం చేస్తున్నా.. వారికి ఏం లాభం ఉండదని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.