FbTelugu

కంగన ‘తలైవి’ ఫొటోలు వైరల్

హైదరాబాద్: తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘తలైవా’. ఈ సినిమాలో జయలలిత గెటప్‌లో బాలీవుడ్ నటి కంగన ర‌నౌత్ నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా కంగన తన ట్విట్టర్ ఖాతాలో..

షూటింగులో తీసుకున్న కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో కంగన అచ్చం జయలలితలా చీర కట్టుకొని, చేతిలో దస్త్రాలు పట్టుకుని, నుదుటిపై బొట్టు పెట్టుకుని సంప్రదాయబద్ధంగా ఆమె కనపడుతోంది. జయలలిత వర్థంతి సందర్భంగా ఈ ఫొటోలను షేర్ చేస్తున్నట్లు కంగన స్పష్టం చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.