FbTelugu

మంత్రి ఆదిత్యను ఏకేసిన కంగనా రనౌత్

ముంబై: మహారాష్ట్ర సీఎం కుమారుడు, మంత్రి ఆదిత్య థాక్రేను బాలీవుడ్ నటీమణీ కంగనా రనౌత్ ఏకి పారేసింది. తనపై మురికి రాజకీయాలు చేస్తున్నారంటూ ఆదిత్య చేసిన విమర్శలపై ఆమె ఇవాళ వరుస ట్వీట్లు చేసింది.
మురికి రాజకీయాలకు మీ తండ్రీ సీఎం కావడమే మంచి ఉదాహారణ అని కడిగి పారేసింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతిపై నేను సంధించే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని మీ తండ్రిని అడగండని ఆమె ఆదిత్యను కోరింది.

సుశాంత్ మృతి తరువాత రియా చక్రవర్తి ఎక్కడ ఉంది, సుశాంత్ మరణంపై ముంబై పోలీసులు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, ఫిబ్రవరి నెలలోనే సుశాంత్ జీవితం ప్రమాదంలో ఉందని ఫిర్యాదు రాగా.. ముంబై పోలీసులు మొదటి రోజే ఆత్మహత్య అని ఎలా నిర్ధరించారు, బిహార్ నుంచి విచారణ కోసం వచ్చిన ఐపీఎస్ అధికారి వినయ్ తివారీని క్వారంటైన్ పేర ఎందుకు నిర్భంధించారు, సీబీఐకి కేసు అప్పగించడానికి ఎందుకు భయపడుతున్నారంటూ ఆమె ప్రశ్నలు సంధించింది. దయచేసి వీటికి మీ తండ్రితో సమాధానాలు చెప్పించాలని కంగనా కోరింది.

You might also like