FbTelugu

నన్నెందుకు నిషేధించారు: కంగన ట్వీట్

బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ ఎప్పుడు ఎవరి మీద నోరు పారేసుకుంటుందో తెలియదు. నిత్యం వివాదం చేయడం ఆమెకు అలవాటే. అది కూడా ఒక పార్టీకి వంతపాడడం ఆమె నైజం.

ఇప్పటికే పలు అంశాల్లో ఆమె చిక్కుకోగా తాజాగా ట్విటర్ సీఈఓ పై విమర్శలు గురిపెట్టింది. ఇంతకు ముందు ఆమె చేసిన ట్వీట్ల కారణంగా న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వివాదాస్పద ట్వీట్లను అదే పనిగా చేస్తుండడంతో ట్విటర్ సంస్థ ఆమె ఖాతాను షాడో బ్యాన్ చేశారు. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన కంగన రనౌత్ ఏకంగా ట్విటర్ సీఈఓ జాక్ డోర్సే పై ట్వీట్ చేసింది. సీఈఓ ను చాచా అని సంబోధిస్తూ… భావ వ్యక్తీకరణ చేసినందుకు నా ఖాతాను షాడో బ్యాన్ చేశారు. నన్ను చూసి మీ సంస్థ బృందం గజగజ వణుకుతున్నది. నన్ను నిషేధించలేరు… కొనసాగడానికి అనుమతించరు. ఇంత జరిగినా నేను అభిమానులను పెంచుకోవడానికో, ప్రమోట్ చేసుకోవడానికో ఇక్కడ లేనని ట్వీట్ చేసింది. నేను ఏది మాట్లాడినా దేశం కోసమే. దాన్ని వారు సహించలేకపోతున్నరని కంగనా అసహనం వ్యక్తం చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.