FbTelugu

తలైవి పై కంగన కస్సుబస్సు

ఎప్పుడు వివాదం లేకుండా నిద్రపోని కంగనా రనౌత్ తాజాగా తను నటించిన తలైవి చిత్రం విడుదలపై కస్సుబుస్సుమంది. తమిళనాడు మాజీ సిఎం కుమారి జయలలిత జీవిత చరిత్రతో తీసిన తలైవి లో కంగానా రనౌత్ నటించింది.

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో అనేక రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు, లాక్ డౌన్ లు విధిస్తున్నాయి. కరోనా వ్యాప్తికి కేంద్రాలు గా సినిమా థియేటర్లు, మల్టీ ఫ్లెక్స్ లు మారుతున్నాయంటూ కోర్టులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హైకోర్టుల వ్యాఖ్యల నేపథ్యంలో పలు రాష్ట్రాలలో సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ఈ చిత్రాన్ని ఒటిటిలో రిలీజు చేసేందుకు అమెజాన్ ప్రైమ్, నెట్ ప్లిక్స్ ఫ్లాట్ ఫామ్స్ డిజిటల్ రైట్స్ తీసుకున్నాయి. సినిమా థియేటర్లు మూసేయడం మూలంగా తలైవి చిత్రాన్ని ఒటిటిలో విడుదల చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ ప్రచారాన్ని చూసిన కంగానా రనౌత్ కు కోపం నశాలానికి ఎక్కింది. తలైవి సినిమా థియేటర్లలోనే విడుదల అవుతుంది. తరువాతే ఒటిటిలో అంటూ కంగానా స్పష్టం చేసింది. బాలీవుడ్ లో కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.