FbTelugu

ఎమర్జెన్సీ పై కంగనా చిత్రం

బాలీవుడ్ వివాదాస్పద నటీమణి కంగనా రనౌత్ దేశంలో ఎమర్జెన్సీకి దారి తీసిన పరిస్థితులపై రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కుమారి జయలలిత బయోపిక్ తలైవిలో నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా తమిళ డబ్బింగ్ సెన్సార్ కూడా పూర్తయింది. తలైవి విడుదల కాకముందే మరో చిత్రంలో నటిస్తున్నట్లు కంగనా ప్రకటించి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ పాత్రలో తను నటిస్తున్నట్లు వెల్లడించింది కూడా.

ఇది బయోపిక్ కాదని, ఎమర్జెన్సీ దురాగాతాలపై ఈ చిత్రం తెరకెక్కుతున్నదని కంగనా వివరించింది. ఈ చిత్రాన్ని మణికర్ణిక ఫిల్మ్ పతాకంపై నిర్మిస్తుండగా సాయి కబీర్ దర్శకత్వం వహిస్తున్నాడు. దేశ రాజకీయ పరిస్థితులు అర్థమయ్యే విదంగా పొలిటికల్ డ్రామాతో తీయనున్నారు. ఎక్కడా రాజీపడకుండా భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందిస్తుండగా, ప్రముఖ నటీనటులు నటించనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.