FbTelugu

కాపీరైట్ వివాదంలో కంగనా?

న్యూఢిల్లీ: ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో నానుతూ ఉంటే తప్ప ఆమెకు నిద్ర పట్టదు. కాపీ రైట్ సమస్యతో మరోసారి బాలీవుడ్ వివాదాస్పద నటీమణి కంగనా రనౌత్ వార్తల్లో నిలిచింది.
మణికర్ణిక రిటర్న్స్, ది లెజెండ్ ఆఫ్ దిడ్డా ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నట్లు నిర్మాత కమల్ జైన్ ఇటీవలే ప్రకటించారు. మహమూద్ ఘజ్నవిని రెండుసార్లు ఓడించిన కాశ్మీర్ రాణి దిడ్డా మూవీలో కంగనా ప్రధాన పాత్రలో కన్పించనున్నది. అయితే ఈ సినిమా కథ రైట్స్ పై ఒక రచయిత అభ్యంతరం లేవనెత్తారు. దిడ్డా, ది వారియర్ క్వీన్ ఆప్ కాశ్మీర్ ను తను రచించానని, తన అనుమతి లేకుండా సినిమాను ప్రకటించినందుకు కంగనాపై కేసు నమోదు చేశారు. సినిమాను ప్రకటించే సమయంలో తన కథలోని కొంత భాగాన్ని ఉపయోగించారన్నారు.

రచయిత కేసు ను సవాల్ చేస్తూ కంగనా సోదరి ముంబయి హైకోర్టును ఆశ్రయించింది. రచయిత కౌల తరఫు న్యాయవాదులు యోగితా జోషి, అమానీ ఖాన్ మాట్లాడుతూ, కంగనా రనౌత్ పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నది. బాంద్రా కోర్టులో మా క్లైయింట్ వేసిన కేసును పరిగణనలోకి తీసుకుని పాస్ పోర్టు రెన్యువల్ చేయాలేదన్నారు. ఈ కేసులో స్టేట్ మెంట్ కోసం కంగనా ఇంకా పోలీసుల ముందు హాజరు కాకపోవడంతో మాఫీ చేశారని ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు సమగ్రమైన సమాచారం ఇవ్వనున్నట్లు రచయిత తరఫు న్యాయవాదులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.