FbTelugu

కనకదుర్గ ఫ్లైఓవర్… వెళ్లాలంటే భయం

విజయవాడ: సోమా కంపెనీ వారిచే నిర్మాణం జరుపుతున్న అతి పెద్ద కనకదుర్గ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్లాలంటే వాహనదారులు హడలి పోతున్నారు.
ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో విద్యాధరపురం లేబర్ కాలనీ నుండి కాళేశ్వర మార్కెట్ కు ఇద్దరు యువకులు బయలు దేరారు. కుమ్మర పాలెం సెంటర్ దగ్గర బైక్ పై వెళ్తున్న ఇద్దరిపై ఫ్లైఓవర్ పై నుండి పెద్ద పేచ్చు పడింది. బైక్ నడుపుతున్న వ్యక్తి మెరుగు మల్ల రాజా మండేలా యాదవ్, చేతుల మీద పడి చెయ్యి విరిగింది. స్థానికుల సహాయంతో బందర్ రోడ్డులో గల ప్రశాంతి నర్సింగ్ హోమ్ తీసుకువెళ్ళారు.
ఎక్స్ రే తీసి చెయ్యి విరిగింది అని నిర్ధారించిన డాక్టర్లు అనంతరం సర్జరీ చెయ్యాలి అని సూచించారు. ఫ్లైఓవర్ కింద వెళ్లాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారు. వాహనదారుల పై ఇప్పుడే ఈ విధంగా పెచ్చులు పడుతుంటే, రేపటి రోజున ఫ్లైఓవర్ పై వాహనాలు తిరుగుతున్న సమయంలో క్రింద వెళ్లే వారి పరిస్థితి ఏమిటనే అర్థంకాని అయోమయ పరిస్థితి ఉంది.

ఫ్లైఓవర్ కింద ఎక్కువగా వన్ టౌన్ ట్రాఫిక్ పోలీసు వారు రథం సెంటర్ నుండి కుమ్మర పాలెం సెంటర్ వరకు డ్యూటీ లు నిర్వహిస్తుంటారు. వారి పరిస్థితి ఏమిటో భగవంతుడికే తెలియాలి.

You might also like