FbTelugu

కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం

విజయవాడ: నగర ప్రజల చిరకాల కోరిక అయిన కనకదుర్గ వారధిని కేంద్ర రవాణ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. శుక్రవారం వర్చువల్‌ కార్యక్రమం ద్వారా ఫ్లైఓవర్‌ను ప్రజలకు అంకితం చేశారు.

గత నెల రోజులుగా ఈ ప్రారంభ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తున్నది. రూ.502 కోట్లతో ఆరు వరుసలతో 2.6 కి.మీ మేర దుర్గ గుడి వంతెన నిర్మించారు. సుమారు రెండున్నర సంవత్సరాల కాలం పట్టింది. ఒకే ఫిల్లర్ పై అద్భుతంగా నిర్మాణం చేశారు. ఈ ఫ్లైఓవర్ తో పాటు రాష్ట్రంలో మిగతా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో రూ.7584 కోట్ల రూపాయల విలువైన మరో 16 ప్రాజెక్టులకు వారు భూమిపూజ చేశారు.

మొత్తం రూ.15,592 కోట్ల రూపాయల పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు జరిగాయి. ఇప్పటికే రూ.8,007 కోట్ల రూపాయలతో పూర్తైన 10 ప్రాజెక్టులను కేంద్రమంత్రి గడ్కరీ, సీఎం వైఎస్ జగన్‌లు ప్రారంభించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.