FbTelugu

రజినీకాంత్ నిరాశ పరిచాడు: కమల్

సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా ప్రకటనలో తీవ్ర నిరాశ చెందినట్లు మరో నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ తెలిపారు. ఎన్నికల ప్రచారం తరువాత రజినీని కలుస్తానని అన్నారు.

రాజకీయ రంగ ప్రవేశం పై ఈ నెల 31వ తేదీన రజినీకాంత్ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. ఈ సమయంలో అనారోగ్య సమస్యలు తలెత్తడం, కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో రాజకీయాల్లోకి రావడం లేదని, క్షమించాలని ఆయన అభిమానులను కోరిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై కమల్ హాసన్ స్పందించారు. ఆయన అభిమానుల మాదిరే తాను నిరాశ చెందానని అన్నారు. రజినీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఆయన ఆరోగ్యమే తనకు ముఖ్యమని కమల్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.