FbTelugu

ఇద్దరు హీరోలో భేటీ… మొదలైన ఎన్నికల కాక

చెన్నై: రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇద్దరు అగ్ర హీరోలు భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నది. కమల్ హాసన్, రజనీకాంత్ లు సమావేశమై సుధీర్ఘంగా చర్చించుకున్నారు.
చెన్నై పోయెస్ గార్డెన్ రజనీ నివాసానికి మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ వచ్చారు. రాష్ట్ర రాజకీయాలపై ఇరువురు చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. అయితే ఏం మాట్లాడుకున్నారనేది మాత్రం బహిర్గతం కాలేదు.

ఇటీవల రజనీ హైదరాబాద్ లో అనారోగ్యానికి గురై చికిత్స తీసుకుని చెన్నై వెళ్లిన విషయం తెలిసిందే. ఆరోగ్యం గురంచి వాకబు చేసేందుకే కమల్ హాసన్ వెళ్లారని పార్టీ ప్రతినిధులు అంటున్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో రజనీ మద్ధతు కోరినట్లు తెలిసిందే. అనారోగ్యం కారణంగా రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించడంతో కమల్ ఆయన వద్దకు వెళ్లారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోసారి అధికారం దక్కించుకోవాలని అన్నా డీఎంకే ప్రయత్నిస్తుండా, పదేళ్ల తరువాత అధికారం చేపట్టేందుకు డీఎంకె ఉవ్విళ్లూరుతున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.