FbTelugu

కల్యాణ్ జ్యూవెలర్స్ మేనేజర్ ఆత్మహత్య

గుంటూరు: సత్తెనపల్లి మై కల్యాణ్ జ్యూవెలర్స్ మేనేజర్ సుభాని ఆత్మహత్య చేసుకున్నాడు. సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్య ఘటనకు పాల్పడ్డాడు. సంస్థ ఆర్ధిక లావాదేవిల్లో తేడా రావడంతోనే సూసైడ్ చేసుకుంటునట్లు వీడియోలో వివరించాడు.

లెక్కలు సరి చేసి చెప్పేందుకు వారం రోజుల టైం అడిగినా యాజమాన్యం ఒప్పుకోలేదు. మై కల్యాణ్ జ్యూవెలర్స్ యాజమాన్యం మేనేజర్ సుభాని పై పొలిస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సంస్థ ఒత్తిడికి తట్టుకోలేక మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. దుగ్గిరాల మండలం చిలువూరులో పురుగు మందు తాగి మృతి చెందాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

You might also like