FbTelugu

కాజల్ పెళ్లైంది…

ముంబై: హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి అయిపోయింది. చిన్న నాటి ప్రేమికుడు గౌతమ్ కిచ్లును వివాహమాడింది.

వివాహ వేడుకలు ప్రారంభం మొదలు ఇప్పటి వరకు ఉత్సాహంగా, ఉల్లాసంగా కన్పించిన కాజల్ ఒక్కసారిగా సాధారణ యువతి మాదిరి మౌనం దాల్చింది. పెళ్లి పీటలు ఎక్కిన తరువాత యువతులు ప్రవర్తించిన విధంగానే ఆమె కూడా నిశ్శబ్ధానికి లోనైంది. తుఫాన్ కు ముందు ప్రశాంతత అంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా తన ఫొటోను షేర్ చేసింది. పెళ్లంటే ఆడపిల్లకు ఉండే భయం ఇప్పుడామేను ఆవహించినట్లుగానే చెప్పుకోవాలి. పలువురు సినీ ప్రముఖులు ఆమెకు పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. రకుల్ ప్రీతిసింగ్, తమన్నా భాటియా, సోనూసూద్ శుభాకాంక్షలు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.