FbTelugu

ఆస్తుల కోసమే ఈటల బిజెపి తీర్థం: కడియం శ్రీహరి

వరంగల్: మీ ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఈటల రాజేందర్ బిజెపి లో చేరారని అనిపిస్తుందని, మీలో ఉన్న కమ్యూనిస్టు చనిపోయాడా…? ఏమి ఉద్ధరించడానికి మీరు బిజెపి లో చేరారని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి దెప్పి పొడిచారు.

రాజేందర్ బీజేపీ లో చేరడం ఆయన వ్యక్తిగతం అంటూనే మీ వామపక్ష సిద్దాంతాలు ఏమయ్యాయని నిలదీశారు. పార్టీ అధ్యక్షుడు కాకుండా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో పార్టీ లో చేరడం ఏంటి అని ప్రశ్నించారు. పేద ప్రజల ఆహార అలవాట్ల మీద కూడా దాడి చేసిందని, అది తెలిసి కూడా బిజెపి లో ఎలా చేరారన్నారు. సిఎం కెసిఆర్ పై మీరు వాడిన భాష సరిగా లేదన్నారు. వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్న మీరు ఫ్యూడల్ వ్యవస్థ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. 5 సం క్రితమే సిఎం తో మనస్పర్థలు వస్తే ఇప్పుడు మీకు ఆత్మాభిమానం గుర్తుకు వచ్చిందా అన్నారు. రూ.26 లక్షలు రైతు బంధు తీసుకున్న మీరు ఆ పథకం గురించి తప్పుగా ఎలా మాట్లాడుతారని శ్రీహకరి మండిపడ్డారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.