FbTelugu

సిజెఐ గా ప్రమాణం చేసిన జస్టిస్ రమణ

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.వి.రమణ ఇవాళ రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఆయన చేత ప్రమాణం చేయించారు.

ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, న్యాయమూర్తులు హాజరయ్యారు. 2022 ఆగస్టు 26వ తేదీ వరకు రమణ ఈ పదవిలో కొనసాగనున్నారు. పలువురు న్యాయమూర్తులు రమణకు అభినందనలు తెలిపారు. కరోనా మహమ్మారి కావడంతో నిబంధనలు అనుసరించి నిరాడంబరంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.