FbTelugu

వెంకన్నను దర్శించుకున్న జస్టిస్ రమణ దంపతులు

తిరుమల: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్. ఎన్.వి.రమణ దంపతులు శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వారిని దర్శించుకున్నారు. శ్రీ వారి దర్శనార్థం ఆలయ మహద్వారం వద్ద కు చేరుకున్న జస్టిస్. ఎన్.వి.రమణ దంపతులకు టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి స్వాగతం పలికారు.

సాంప్రదాయం ప్రకారం వేద పండితుల ఆశీర్వాదం తో ఆలయం లోకి వెళ్లి శ్రీవారిని దర్శించు కున్నారు. దర్శనానంతరం రంగ నాయకుల మండపం లో వేద పండితులు ఆశీర్వాదాలతో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆ తరువాత రమణ దంపతులు బేడీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలితా కుమారి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర బాబు, తిరుపతి అదనపు జిల్లా జడ్జి వై.వీర్రాజు, ప్రోటోకాల్ మేజిస్ట్రేట్ పవన్ కుమార్, వైసిపి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు.ఈ కార్య క్రమంలో టిటిడి టిటిడి ఈఓ డా. కె.ఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈఓ ఏవి.ధర్మా రెడ్డి, సివిఎస్ఓ గోపీనాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్.పి వెంకట అప్పల నాయుడు పాల్గొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.