FbTelugu

జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ వ్యాఖ్యలు అసంబద్దం: ఏఏజీ

అమరావతి: బిల్డ్‌ఏపీ కేసులో జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ ఇచ్చిన తీర్పుపై ఏఏజీ (అడిషనల్ అడ్వకేట్ జనరల్) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలు ప్రస్తావించారు. బిల్డ్‌ఏపీ కేసుకు సంబంధంలేని అప్రస్తుత అంశాలను, రికార్డుమీదకు రాని విషయాలను ఆర్డర్‌కాపీలో ప్రస్తావించారని, తమ లీగల్‌ టీం సర్టిఫైడ్‌ కాపీలకోసం ఫైల్‌చేసి విచారణకు వచ్చిన కేసు ఒకటైతే, జడ్జి తీర్పులో పేర్కొన్న అంశాలు ఈ కేసుకు సంబంధం లేనివన్నారు.

దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ ఇంతకుముందు ఇచ్చిన పలు తీర్పుల్లోని అంశాలను, ఆయన చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలు హైకోర్టు స్థాయిని, హైకోర్టు న్యాయమూర్తుల స్థాయిని, న్యాయవ్యవస్థ స్థాయిని, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల స్థాయిని తగ్గించేలా ఉన్నాయి. సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయాలను సవాల్‌చేస్తూ చేసిన వ్యాఖ్యలు చాలా ఆందోళనకరం’’ అన్నట్టుగా తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.