FbTelugu

సిజెఐ గా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ: భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం పూర్తయిన తరువాత సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ప్రస్తుత సీజేఐ ఎస్.ఎ.బొబ్డే పదవీకాలం నిన్నటితో ముగిసిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి భవన్ లో జస్టిస్ ఎన్వీ రమణతో రాష్ట్రపతి ప్రమాణం చేయించనున్నారు. ఈ పదవిలో 2022 ఆగస్టు 26 వరకు కొనసాగనున్నారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా హాజరవుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.