FbTelugu

ఏపీ ఎస్ఈసీ గా జస్టిస్‌ కనకరాజ్ బాధ్యతల స్వీకారం

అమరావతి: రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా జస్టిస్‌ జే.కనకరాజ్‌ నియమితులు కావడం, పదవీ బాధ్యతలు స్వీకరించడం వెంట వెంటనే జరిగిపోయాయి.
కొత్త ఎన్నికల కమిషనర్ జే. కనకరాజు విజయవాడలోని బందరు రోడ్డులో ఉన్న రాష్ర్ట ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఇవాళ ఉదయం బాధ్యతలు స్వీకరించారు. నియామకం విషయంలో ఆఖరు నిమిషం వరకూ అత్యంత రహస్యంగా ఉంచిన జగన్ ప్రభుత్వం, కనకరాజు ఆఫీసుకు వచ్చే వారకూ ఎవరికీ తెలీకుండా జాగ్రత్త వహించింది.

ఏపీ స్టేట్‌ఎలక్షన్‌ కమిషనర్‌ హోదాలో రిటైర్డ్‌ హైకోర్టు జడ్జిని నియమించేలా శుక్రవారం ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. తాజా ఆర్డినెన్స్‌ ప్రకారం జస్టిస్‌ కనకరాజ్‌ నియామకం చేశారు. మద్రాస్ హైకోర్టు జడ్జీగా విద్య, బాలలు, మహిళల, వృద్ధుల సంక్షేమ అంశాలకు సంబంధించి ఆయన కీలక తీర్పులు ఇచ్చారు.

తమిళనాడు రాష్ట్రం తుత్తుకుడి సమీపంలోని మరవన్మదం లో 1639 లో జే.కనకరాజ్ జన్మించారు. బ్యాచిలర్స్ ఇన్ లా చేసిన తరువాత 1956 లో మద్రాస్ హైకోర్టులో అడ్వకేట్ గా లా ప్రాక్టీస్ ప్రారంభించారు.

1990 లో మద్రాస్ హైకోర్టు జడ్జీగా ప్రమాణ స్వీకారం చేశారు. పదవీ విరమణ తరువాత తమిళనాడు సెల్స్ టాక్స్ స్పెషల్ ట్రిబ్యునల్ ఛైర్మన్ గా మూడేళ్లు పనిచేశారు. 2010 లో తమిల్ ఎవాంజిలికల్ లూథరన్ చర్చి అడ్మినిస్ట్రేటర్ గా నియమించారు. నార్త్ చెన్నైలోని చెవలియర్ టీ. థామస్ ఎలిజిబెత్ కాలేజీ ఫర్ విమెన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.

You might also like