FbTelugu

జస్టిస్ ఈశ్వరయ్యకు సుప్రీంలో చుక్కెదురు

న్యూఢిల్లీ: రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్యకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. న్యాయమూర్తులపై తాను చేసిన వ్యాఖ్యలపై హైకోర్టులో జరుగుతున్న విచారణపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇవాళ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

జడ్జి రామకృష్ణతో మాట్లాడిన మాట నిజమేనని ఈశ్వరయ్య తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అంగీకరించారు. దీంతో ఆ ఫోన్ సంభాషణ పై ఆఫడవిట్ దాఖలు చేయాలని ప్రశాంత్ భూషణ్ ను ధర్మాసనం ఆదేశించింది. ఇద్దరు వ్యక్తుల ప్రైవేట్ సంభాషణలపై విచారణ అవసరం లేదని ప్రశాంత్ భూషణ్ వాదించారు. ఈశ్వరయ్య వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ పై జరిగిన దాడిగా పరిగణించాలని కపిల్ సిబల్ వాదించారు. ఈకేసు విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.