FbTelugu

జస్టిస్ ఈశ్వరయ్య కు సుప్రీంకోర్టులో ఊరట

న్యూఢిల్లీ : జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ సంభాషణ కేసులో హైకోర్టు ఆదేశించిన దర్యాప్తు అవసరం లేదన్న సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) నిర్వహణపై తప్ప హైకోర్టు ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

హైకోర్టులో దాఖలైన పిల్ మెరిట్స్ జోలికి తాము వెళ్లట్లేదని, పిల్ మెయింటైనబిలిటీని హైకోర్టు పరిగణించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఫోన్ కేసు సంభాషణ పై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డి ధర్మాసనం ఇవాళ తీర్పు వెల్లడించింది. ఏపీ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు లో జస్టిస్ ఈశ్వరయ్య సవాల్ చేశారు. జిల్లా మేజిస్ట్రేట్ తో ఫోనులో వివాదాస్పదంగా మాట్లాడారని హైకోర్టు విచారణకు ఆదేశించింది. ఫోన్ సంభాషణలో కుట్ర కోణం ఉందో.. లేదో తేల్చాలని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణ కోసం సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ రవీంద్రన్ ను నియమించిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.