FbTelugu

బిగ్ బాస్-4 కు అప్పుడే అపశకునం

హైదరాబాద్: బిగ్ బాస్-4 రియాల్టీ షో కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న సమయంలో పిడుగు లాంటి వార్త పడింది. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ నెల 29వ తేదీ నుంచి బిగ్ బాస్ షో ప్రారంభం కావాల్సి ఉంది.

అయితే మొత్తం 16 మంది కంటెస్టెంట్లలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. దీంతో మిగతా కంటెస్టెంట్లు షాక్ కు గురయ్యారు. హీరో అక్కినేని నాగార్జున పుట్టిన రోజు అయిన 29వ తేదీనాడు బిగ్ బాస్ ప్రారంభిస్తారని అంటున్నారు. అందుకు తగ్గట్లుగానే కంటెస్టెంట్లందరినీ ఒక హోటల్ కు తరలించారు. ఆ తరువాత వారందరికీ కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. అందులో ఒకరికి నిర్థారణ కావడంతో మిగతా 15 మంది కంగుతిన్నారు.

షో ప్రారంభానికి మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. అప్పటికల్లా కంటెస్టెంట్ కు పాజిటివ్ తగ్గుతుందా లేదా అనే చర్చ మొదలైంది. ప్రారంభం కల్లా నెగెటివ్ వస్తే సరి లేదంటే ఆయన స్థానంలో మరొకరిని తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

You might also like