FbTelugu

జూరాల 8 గేట్లు ఎత్తివేత

మహబూబ్ నగర్: గత కొన్ని రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు జురాల ప్రాజెక్టుకు వరద భారీగానే వస్తోంది. వరద ఎక్కవగా ఉండడంతో 8 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.

ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 79 వేల క్యూసెక్కులు ఉండగా.. దిగువకు 78,878 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.857 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 9.377 టీఎంసీల నీరు ఉంది.

You might also like