FbTelugu

వ్యాక్సిన్ వద్దంటూ నదిలోకి దూకారు!

లక్నో: వ్యాక్సిన్ ఇస్తే అదే పదివేలు అని జనం అనుకుంటున్న తరుణంలో ఒక గ్రామంలో వ్యాక్సిన్ ఇస్తామని వైద్య సిబ్బంది రాగా జనం మాకొద్దంటూ నదిలోకి దూకారు. ఈ ఘటన బారాబంకి గ్రామంలో చోటుచేసుకున్నది.

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు, ప్రైవేటు హాస్పిటళ్ల ముందు లక్షలాది మంది క్యూ కడుతున్నారు. అయినా దొరకడం లేదు. ముందుగా బుక్ చేసుకున్నవారికి మాత్రమే ఇస్తున్నారు. సెకండ్ వేవ్ తీవ్రత పెరడంతో అన్ని గ్రామాలకు వ్యాక్సిన్ బృందాలను పంపిస్తున్నారు. బారాబంకి గ్రామంలోకి వైద్య సిబ్బంది వ్యాక్సిన్ల ను తీసుకుని వెళ్లారు. వ్యాక్సిన్ వేయించుకునేందుకు రావాల్సిందిగా చాటింపు వేయించారు. ఇచ్చేది కరోనా వ్యాక్సిన్ కాదు, విషం అంటూ కొందరు గ్రామం నుంచి పరుగులు తీశారు. సమీపంలోని సరయు నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషయం తెలియడంతో గ్రామ సర్పంచి సరయు నది వద్దకు వెళ్లి వారి ప్రాణాలను కాపాడారు. గ్రామంలో కేవలం 14 మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకోవడంతో, వైద్య సిబ్బంది చేసేది లేక తిరుగుముఖం పట్టారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.