FbTelugu

5జి టెక్నాలజీ ని సవాల్ చేసిన హీరోయిన్

న్యూఢిల్లీ: ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్, పర్యావరణ కార్యకర్త జూహీ చావ్లా ఐదో తరం (5జి) సాంకేతికతపై ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ నూతన టెక్నాలజీ మూలంగా పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని, హానికర అంశాలపై దృష్టి పెట్టాలని హైకోర్టును అభ్యర్థించింది.

ఇవాళ జూహీ లేవనెత్తిన అంశాలపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సి.హరిశంకర్ బెంచ్ ఇరు పక్షాల వాదోపవాదనలు విన్నది. వైర్ లెస్ పరికరాలు, కొత్త కొత్త టెక్నాలజీ మూలంగా రేడియో ఫ్రీక్వెన్సీ ధార్మికత విడుదల అవుతుందని ఆమె తన పిటీషన్ లో తెలిపింది. హైకోర్టులో విచారణకు వచ్చిన సందర్భంగా జూహీ చావ్లా మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆరోగ్యంపై రేడియేషన్ తీవ్ర ప్రభావం చూపిస్తున్నదని, అన్ని కోణాల్లో పరిశీలించాకే అనుమతులు ఇవ్వాలని కోరింది. 5జి టెక్నాలజీ వస్తే మానవులతో పాటు వన్యప్రాణులపై అధిక ప్రభావం చూపిస్తుందన్నారు. దీని వల్ల పర్యావరణానికి శాశ్వత నష్టం కలుగుతుందని అన్నారు. నూతన టెక్నాలజీతో ఎవరికి ముప్పులేదని సంబంధిత ప్రభుత్వ విభాగాలు ధృవీకరించాలన్నారు. ఇది సురక్షితమా కాదా అనే అంశంపై అధ్యయనం జరగాలని, దీనిలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం ఉండకూదని జూహీ చావ్లా కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.