హైదరాబాద్: ఎర్రగడ్డ ఛాతీ హాస్పిటల్ లో మరణించిన రవి కుమార్ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
మృతుడి కుటుంబానికి రూ.1 కోటి నష్ట పరిహారం చెల్లించాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా వైద్యాన్ని గాలికి వదిలేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నదన్నారు. ఈ ఘటనకు ప్రాథమిక బాధ్యత వహిస్తూ ఛాతీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ని సస్పెండ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రవి కుమార్ నరకయాతన అనుభవిస్తూ పెట్టిన ఈ వీడియో నాతో పాటు చూసిన ప్రతి ఒక్కరిని బాధించిందన్నారు.
ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రభుత్వ హాస్పిటల్స్ యొక్క వాస్తవ పరిస్థితిని ఈ సంఘటన కళ్ళకు కట్టినట్లుగా చూపెట్టిందన్నారు. ప్రభుత్వ ఛాతి హాస్పిటల్ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే రవి కుమార్ మరణించాడని ఆయ ఆరోపించారు. ఈ సంఘటనను ఇప్పటికే హైకోర్టు సుమోటో కేసుగా తీసుకొని విచారించాల్సి ఉండాల్సిందన్నారు. ఎన్నో సంఘటనల మీద వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు, ఇంతటి హృదయ విధారకమైన ఈ దారుణ సంఘటనను హైకోర్టు సుమోటోగా తీసుకోకపోవడం సరైంది కాదని మంద కృష్ణ అన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Next Post
You might also like