FbTelugu

ఎ.పి.పి.ఎస్.సి పై తీర్పు రిజర్వ్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (ఎ.పి.పి.ఎస్.సి) నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల కేసు తీర్పును ఏపి హైకోర్టు ఇవాళ తీర్పును రిజర్వ్ చేసింది. గ్రూప్-1 అభ్యర్థుల పేపర్ సరి చేయడాన్ని ప్రైవేటు సంస్థకు అప్పగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్ పై విచారణ జరిగింది.

మెయిన్స్ పేపర్ సరి చేసే పని ఎ.పి.పి.ఎస్.సి చేయాల్సి ఉండగా టాటా కన్సల్టెన్సీ కి అప్పగించారని అభ్యర్థులు కోర్టుకు తెలిపారు. గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలను నిబంధనల ప్రకారం నిర్వహించలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. డిజిటల్‌ వాల్యూషన్‌ గురించి చివరి దశలో తెలిపారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. తెలుగు మీడియం పేపర్లను రాష్ట్రంలోనూ, ఆంగ్ల మీడియం పేపర్లను ఇతర రాష్ట్రాల్లోనూ వాల్యూషన్‌ చేశారన్నారు. ఇవాళ హైకోర్టు ఇరువైపులా వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.