FbTelugu

అయోధ్య తీర్పు జడ్జీలు వీరే..!

Judges-of-Ayodhya-verdict

ఢిల్లీ: అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం కేసులో తుది తీర్పు వెలువడింది. అయోధ్య భూవివాదం కేసులో ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. సీజేఐ రంజన్ గొగోయ్ సారథ్యం లోని బెంచ్ తీర్పుపై దేశవ్యాప్తంగా ఆసక్తిగా చూశారు. ఈ కేసును విచారిస్తున్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ అబ్దుల్ నజీర్ ఒక్కరే ముస్లిం న్యాయమూర్తి. ధర్మాసనంలోని ఇతర ముగ్గురు సభ్యులు జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్ హిందువులే. ఈ ముగ్గురితో పాటు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయి కూడా హిందువే. అయోధ్య కేసును ఈ ఏడాది ఆగస్టు 6 నుంచి రోజువారీగా కేసును విచారిస్తున్నది.

1. జస్టిస్ రంజన్ గొగోయ్, భారత ప్రధాన న్యాయమూర్తి

అయోధ్య రాజ్యాంగా ధర్మాసనానికి ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయి నేతృత్వం వహిస్తున్నారు. 2012 , ఏప్రిల్ 23 న జస్టిస్ రంజన్ గొగోయ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు 3 అక్టోబర్ 2018 న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈనెల 17న పదవీ విరమణ చేయనున్నారు. నవంబర్ 18, 1954 న అస్సాం రాష్ట్రంలో జన్మించిన జస్టిస్ రంజన్ గొగోయ్ 1978 లో బార్ కౌన్సిల్‌లో చేరారు. గౌహతి హైకోర్టుతో న్యాయవాది వృత్తిని ప్రారంభించారు. 2001 లో గౌహతి హైకోర్టులో న్యాయమూర్తిగా గొగోయ్ ప్రమాణ స్వీకారం చేశారు. తరువాత 2010 లో పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2011 లో పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.

2. జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే (ఎస్‌ఏ. బొబ్డే)

ఎస్. ఏ బోబ్డే 1978 లో మహారాష్ట్రలోని బార్ కౌన్సిల్‌లో చేరి న్యాయవాద వృత్తి ప్రారంభించారు. బాంబే హైకోర్టు బొంబాయి బెంచ్‌లో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1998 లో సీనియర్ న్యాయవాదిగా వివిధ కేసులలో వాదించారు. 2000 సంవత్సరంలో బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. తరువాత మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అక్కడి నుంచి బదిలీపై 2013 లో సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా చేరారు. జస్టిస్ ఎస్ఏ. బొబ్డే ఏప్రిల్ 23, 2021 న పదవీ విరమణ చేయనున్నారు.

3. జస్టిస్ ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్

జస్టిస్ డి.వై.చంద్రచుడ్ 2016, మే 13 న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ డివై చంద్రచూడ్ సుప్రీంకోర్టుకు ముందు ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఉత్తరప్రదేశ్ తరువాత బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా ఆయన పనిచేశారు. ప్రపంచంలోని అనేక పెద్ద విశ్వవిద్యాలయాలలో జస్టిస్ డి.వై.చంద్రచుడ్ న్యాయశాస్త్రంపై ప్రసంగాలు ఇచ్చారు. న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టక ముందు సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్ గా పనిచేశారు. శబరిమల, భీమా కోరెగావ్, స్వలింగ సంపర్కంతో సహా పలు పెద్ద కేసుల్లో ఆయన బెంచ్‌లో కీలకంగా వ్యవహరించారు. చంద్రచూడ్ తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు.

4. జస్టిస్ అశోక్ భూషణ్

జస్టిస్ అశోక్ భూషణ్ ఉత్తరప్రదేశ్‌ లోని జౌన్‌పూర్‌లో జన్మించారు. 1979లో యుపీ బార్ కౌన్సిల్‌లో సభ్యత్వం తీసుకుని అలహాబాద్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. అలహాబాద్ హైకోర్టులో అనేక పోస్టులలో ఆయన పనిచేశారు. అశోక్ భూషణ్ 2001 లో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్ నుంచి బదిలీపై వెళ్లి 2014 లో కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా చేరారు. 2015 లో కేరళ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. కేరళ నుంచి బదిలీపై వచ్చిన ఆయన 2016, మే 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.

5. జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్

కర్నాటక హైకోర్టులో 1983 ఫిబ్రవరి 18న న్యాయవాద వృత్తిని నజీర్ ప్రారంభించారు. 2003, మే 12న కర్నాటక హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2004 సంవ్సరంలో పూర్తిస్థాయి న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2017, ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు జడ్జిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

You might also like