FbTelugu

జగన్ తిడితే ఒప్పు.. నేను తిడితే తప్పా?: జడ్జి రామకృష్ణ

చిత్తూరు: ఏపి సిఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసిన జడ్జి రామకృష్ణ ను పోలీసులు అరెస్టు చేశారు. జడ్జి రామకృష్ణ బి కొత్తకోట నుంచి మదనపల్లెలో కరోనా టెస్ట్ కోసం వెళుతుండగా దారి మధ్యలో పోలీసులు అదుపులోకి తీసుకొని పీలేరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

నంద్యాల ఉపఎన్నికల్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్.జగన్ అప్పటి ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడును నడిరోడ్డుపై కాల్చి చంపాలని అన్నారని.. ఇప్పుడు తాను అదే విధంగా అన్నానని రామకృష్ణ చెప్పారు. జగన్ అప్పటి ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు తప్పుకానప్పుడు తాను ఇప్పుడు సీఎం జగన్‌ను అంటే దేశ ద్రోహం ఎలా అవుతుందని మండిపడ్డారు. కరోనా నిర్థారణ పరీక్షల కోసం మదనపల్లె వెళ్తుండగా రామకృష్ణను అరెస్టు చేశారు. పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరు పరచనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.