FbTelugu

పోలీసు స్టేషన్ లో జడ్జీ ఐ ఫోన్ చోరీ

అమరావతి: సీబీఐ విచారణలో ఉన్న జడ్జీ రామకృష్ణ కేసులో పోలీసులు పొంతనలేని మాటలు చెబుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామకృష్ణను అరెస్టు చేసినప్పుడు ఆయన ఐ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని పోలీసులు చెబుతున్నారు. అయితే పోలీసుల మాటలపై రామకృష్ణ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక వైసీపీ పెద్దలు ఉన్నారని ఆయన ఆరోపించారు. ఐ ఫోన్ చోరీపై జడ్జి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రయోజనాల కోసం పోలీస్ వ్యవస్థను ఏ విధంగా వాడుకుంటుందో ఈ సంఘటనతో తేటతెల్లమైందన్నారు. అతి విలువైన సమాచారం ఉన్న తన ఐ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, దాన్ని కోర్టులో డిపాజిట్ చేయలేదన్నారు. పోలీసులు నేరుగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇచ్చి ఆయన ద్వారా ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డిని ఆరోపించారు.

తన ఫోన్ తనకు అప్పగించాలని కోర్టును ఆశ్రయించగా.. పోలీసులకు నోటీసులు పంపిందన్నారు. మూడు నెలలు అవుతున్నా ఇంతవరకు తన ఫోన్‌ను కోర్టులో డిపాజిట్ చేయలేదన్నారు. పోలీసులు మూడు రోజుల క్రితం ఒక మెమో ను కోర్టులో పైల్ చేశారన్నారు. తమ కస్టడీలో ఉన్న ఫోన్‌ను ఎవరో దొంగతనం చేశారని ఆ మెమో లో పేర్కొన్నారని జడ్జీ రామకృష్ణ చెప్పారు. జడ్జీకి చెందిన ఫోన్ చోరీ అయ్యిందంటే, సామాన్యుల ఫోన్ కు విలువ ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.