FbTelugu

కుర్రాడి కథ విని చలించిన జడ్జి…

లాక్ డౌన్ ఆ యువకుడికి శాపంగా మారింది. ఉపాధి లేకపోవడడంతో తల్లికి మందులు, ఆహారం కోసం పర్సు దొంగిలించి పోలీసులకు దొరికిపోయాడు.

పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఆ కుర్రాడిని పట్టుకుని, జడ్జి ముందు ప్రవేశ పెట్టారు. అతడు చెప్పే విషయాలు విని జడ్జి చలించిపోయారు. ఆ కుర్రాడికి స్వయంగా తన జేబులోంచి నిత్యావసర సరకులకు డబ్బులు ఇచ్చి, ప్రభుత్వ పరంగా అందే పథకాలను మంజూరు చేయాలని స్థానిక అధికారులన ఆదేశించారు. మనసును కదిలించే కథనానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

బిహార్ లోని నలందకు చెందిన 16 సంవత్సరాల కుర్రాడు నరేంద్ర రావు ఇస్లాంపూర్ మార్కెట్ లో పనిచేసేవాడు. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా ఉన్న ఉపాధి కోల్పోయాడు. ప్రతిరోజు మార్కెట్ కు రావడం, పని లభించక వెనక్కి వెళ్లిపోవడం జరుగుతోంది.

డబ్బులు లేక, కుటుంబాన్ని పోషించడం కోసం ఏప్రిల్ 17వ తేదీన ఇస్లాంపూర్ మార్కెట్ లో మహిళ పర్సు దొంగిలించాడు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన స్థానిక పోలీసులు నరేంద్ర రావును అరెస్టు చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేసి నలందా డిస్ట్రిక్టు

కోర్టులో ఏప్రిల్ 19న ప్రవేశపెట్టారు. డిస్ట్రిక్ట్ జడ్జి మానవేంద్ర మిశ్రా కేసు విచారణ ప్రారంభించారు. దొంగతనం ఎందుకు చేశావని జడ్జి ప్రశ్నించగా నరేంద్ర రావు తన గోడును వెల్లడించాడు. తన తండ్రి కొన్నేళ్ల క్రితమే చనిపోయాడని, తల్లి మానసికంగా కృంగిపోయిందన్నాడు. 12 సంవత్సరాల తమ్ముడు, తల్లికి తానే తిండి పెట్టాలన్నాడు. తల్లికి మందులు కొనాల్సి ఉందన్నాడు. కరోనా కారణంగా పని లేకుండా పోయింది. ఎక్కడా పనిచేద్దామని పని లభించకని దుస్థితిలో తల్లి, తమ్ముడి ఆకలి తీర్చడానికి పర్సు దొంగతనం చేశానని చెప్పడంతో జడ్జి చలించిపోయాడు. కుర్రాడిని క్షమించి వదిలేస్తూ, తన జేబులోంచి డబ్బులు ఇచ్చి నిత్యావసర సరకులు కొనిచ్చి పంపించాల్సిందిగా తన వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించారు.

కుర్రాడి కాలు విరిగి, చికిత్స తీసుకోక కర్రల సాయంతో నడుస్తుండడం చూశాడు. ఎలాంటి ఆధారం లేని కుర్రాడి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా అర్హత ఉన్న అన్ని సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని స్థానిక అధికారులను జడ్జి ఆదేశించారు.

You might also like