FbTelugu

జీఓ 2430పై జర్నలిస్టుల ఆగ్రహం

Journalists-outrage-over-go

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 2430 పై జర్నలిస్టుల నుంచి సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. నిరాధార వార్తలు ప్రచురించే సంస్థలపై ఉక్కుపాదం మోపేందుకు తీసుకొచ్చిన ఈ జీఓ 2430తో జర్నలిస్టులను అణచిపెట్టాలని చూస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఆ జీఓ కు వ్యతిరేకంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని జర్నలిస్టు సంఘాలు పిలుపునిచ్చాయి. దీనికి టీడీపీ మద్దతు ప్రకటించింది. అవినీతిపై వార్తలు రాస్తే జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టే అధికారం సంబంధితశాఖ అధికారులకు ఇచ్చారని, ఈ జీఓ ను రద్దు చేసే వరకు తాము పోరాడతామని మాజీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. కాగా, నేడు రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలు ధరించాలని, ప్రజాప్రతినిధులు, అధికారులకు వినతిపత్రాలు అందజేసి, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐవీ సుబ్బారావు, చందు జనార్దన్‌‌లు పిలుపునిచ్చారు.

You might also like