FbTelugu

ఎమర్జెన్సీ సేవల పరిధిలోకి జర్నలిస్టులు: యునెస్కో

ప్రపంచ దేశాలకు ఆదేశాలు

పారిస్: వర్కింగ్ జర్నలిస్టులను ఎమర్జెన్సీ సేవల కింద పరిగణించాలని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునెస్కో ప్రపంచ దేశాల ప్రభుత్వాలను కోరింది. ఐక్య రాజ్య సమితి న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యునెస్కో డైరెక్టర్‌ గైబెర్గర్‌ మాట్లాడుతూ… తప్పుడు వార్తలతో దుష్ప్రభాలను, వాటిని నిరోధించడానికి మీడియా ఆవశ్యకతను వివరించారు.

సమాజంలో భయం నెలకొన్నప్పుడు సోషల్ మీడియా, ఇతర మార్గాల ద్వారా తప్పుడు వార్తలు వెల్లువెత్తుతాయన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మాత్రమే వాస్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్తుందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. అయినా మీడియా సహకారం తప్పక తీసుకోవాల్సి ఉంటుందని యునెస్కో డైరెక్టర్‌ గైబెర్గర్‌ స్పష్టం చేశారు.

You might also like