FbTelugu

ఫ్రంట్ లైన్ వారియర్స్ గా జర్నలిస్టులు: డాక్టర్ శ్రీనివాస్ రావు

హైదరాబాద్: మీడియా లో పని చేసే వర్కింగ్ జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా రాష్ర ప్రభుత్వం గుర్తించిందని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు.

రాష్ట్రంలో వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియ విజయవంతంగా నడుస్తోందని అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాజాగా 3762 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయన్నారు. త్వరలోనే లక్షన్నర కరోనా పరీక్షలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కరోనా ఔట్ పేషెంట్ సేవలు కూడా ప్రారంభించామన్నారు. ఫీవర్ సర్వే కూడా విజయవంతంగా నడుస్తోందని, 33470 టీములు సర్వే చేస్తున్నాయన్నారు. ఇప్పటికే ఒక కోటి కి పైగా ఇళ్లల్లో సర్వే జరిగిందని, రెండో రౌండ్ ఫీవర్ సర్వే జరుగుతోందని ఆయన వివరించారు. మహారాష్ట్ర తరువాత తెలంగాణా లో తక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. ఈనెలాఖరు వరకు కరోనా పరిస్థితుల నుండి బయట పడుతామన్నారు. రాష్ట్రంలో 56 లక్షల మందికి ఇవాళ వ్యాక్సిన్ వేశామన్నారు. ప్రస్తుతం 6 లక్షల కోవి షీల్డ్ వ్యాక్సిన్ డోసులు, 3 లక్షల కోవాగ్జిన్ డోసులు అందుబాటులో ఉన్నాయి. 7లక్షల 75 వేల మంది సూపర్ స్పైడర్స్ ను గుర్తించామని, వీరందరికీ 28 నుంచి వ్యాక్సినేషన్ ఇస్తామని శ్రీనివాస్ రావు అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.