FbTelugu

ఆ రాష్ట్రంలో జర్నిలిస్టులు ఫ్రంట్ లైన్ వారియర్స్

భువనేశ్వర్: జర్నలిస్టులను ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించింది. ఈ మేరకు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనా వైరస్ చైన్ ను కట్ చేసేందుకు ఒడిశా ప్రభుత్వం ఇవాళే రెండు వారాల లౌక్ డౌన్ ప్రకటించింది. పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ కోవిడ్ వారియర్స్ గా సిఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు.

కరోనా మహమ్మారిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ రాష్ట్రానికి గొప్ప సేవలు చేస్తున్నారని ప్రశంసించారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో పనిచేసుతన్న 6944 వర్కింగ్ జర్నిలస్టులకు ప్రయోజనం చేకూరనున్నది. తాజా ప్రకటనతో ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఆరోగ్య బీమా లభించడంతో పాటు ఒక వేళ కరోనా తో మరణిస్తే కుటుంబ సభ్యులకు రూ.15 లక్షల ఎక్స్ గ్రేషియా అందచేయనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.