FbTelugu

జర్నలిస్టుపై బెడెన్ చిర్రుబుర్రు?

జెనివా: అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత జోసెఫ్ ఆర్.బైడెన్ తొలిసారి ఒక జర్నలిస్టుపై అసహనం వ్యక్తం చేశాడు. అందరూ చూస్తుండగానే జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన మళ్లీ క్షమాపణలు కూడా చెప్పాడు.
రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ తో భేటీ తరువాత బైడెన్ మీడియాతో మాట్లాడారు. ఈ భేటీ తరువాత పుతిన్ తన ప్రవర్తన మార్చుకుంటారనే విశ్వాసం మీకు ఉందా అని సిఎన్ఎన్ కరస్పాండెంట్ కైట్లాన్ కొలిన్స్ ప్రశ్నించారు.

సైబర్ దాడులు, మానవ హక్కుల ఉల్లంఘనల గురించి పుతిన్ దగ్గర నుంచి సరైన సమాధానం రాలేదని చెప్పింది. అలాంటప్పుడు ఇది నిర్మాణాత్మక భేటీ అని ఎలా అనుకుంటారని కైట్లాన్ పదే పదే ప్రశ్నించడంతో బైడెన్ కు చిర్రెత్తుకొచ్చింది. దీనిపై బైడెన్ స్పందిస్తూ, పుతిన్ తన ప్రవర్తన మార్చుకుంటారని నాకు ఎంతమాత్రం నమ్మకం లేదు. అయినా నేను నమ్మకంగా ఉన్నాడని ఎప్పుడు చెపానని ప్రశ్నించాడు. నాకు దేనిపైనా నమ్మకం లేదు, ఒక వాస్తవం మాత్రం చెబుతాను. ఆ విషయం మీకు అర్థం కాకపోతే నేనేమి చేయలేనని బైడెన్ అసహనం తో చెప్పారు. నా ఏజెండా రష్యాకు లేదా మరో దేశానికి వ్యతిరేకం కాదని, కేవలం అమెరికా ప్రజల కోసమేనని పుతిన్ కు స్పష్టం చేసినట్లు బైడెన్ తెలిపారు. మీడియా సమావేశం ముగిసిన తరువాత ఆయన బయటకు వెళ్తూ… మళ్లీ వెనక్కి వచ్చి సిఎన్ఎన్ జర్నలిస్టుకు క్షమాపణలు చెప్పి వెళ్లారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.