FbTelugu

చంద్రబాబు మళ్లీ గెలిచి మాట్లాడాలి: జోగి రమేష్

అమరావతి: ఇప్పుడు రెఫరెండం కోరాల్సింది చంద్రబాబు నాయుడే అని, ఆయన పోషిస్తున్న ప్రతిపక్ష పాత్ర మీద రెఫరెండం కోరాలని ఎమ్మెల్యే, వైసీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ అన్నారు.
తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు పనికి వస్తాడా.. లేదా.. అన్న అంశంపై ప్రజా తీర్పు కోరాలని ఆయన సవాల్ చేశారు. ఏనాడైనా చంద్రబాబు నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించాడా.. ?. టీడీపీ గెలిచిన 23 స్థానాల్లో రాజీనామాలు చేయించి ప్రజా తీర్పుకు వెళ్ళాలి.. ప్రజలు ఎన్ని సీట్లలో గెలిపిస్తారో చూడాలని రమేష్ అన్నారు.
ముందు ఈ పరీక్షలో పాస్ అయిన తర్వాత.. 23 సీట్లలో గెలిచిన తర్వాత రెఫరెండం గురించి మాట్లాడాలని ఆయన హితవు పలికారు. చంద్రబాబు నిజంగా రాజధాని కట్టి ఉంటే.. గ్రాఫిక్స్ లో కాకుండా ప్రజల కళ్ళకు చూపించి ఉంటే.. ఎందుకు ప్రజలు ఓడిస్తారు?. ఇవేమీ పట్టించుకోకుండా.. ఇంకా రెఫరెండం కోరాలని ఆయన అంటున్నారు. మేం ప్రజా తీర్పు కోరే 151 స్థానాలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చామని జోగి రమేష్ అన్నారు.

ప్రజలు చంద్రబాబు ను, ఆయన నిర్ణయాలను ఆమోదించి ఉంటే… ఆ ప్రాంతంలోనే టీడీపీ ఎందుకు ఓడిపోయింది..? అమరావతి రాజధాని నడిబొడ్డున ఉన్న తాడికొండలో ఓడిపోయావ్.. స్వయానా నీ ముద్దుల కొడుకు ఎమ్మెల్సీ లోకేష్ బాబు మంగళగిరిలో చిత్తు చిత్తుగా ఎందుకు ఓడిపోయాడు..?. సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే రమేష్ డిమాండ్ చేశారు.

You might also like