FbTelugu

కరోనాతో చనిపోతే మళ్లీ ఉద్యోగం

పశ్చిమ బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం

కొలకత్తా: కరోనా మహమ్మారితో చనిపోయే ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రజల సౌకర్యార్థం లాక్ డౌన్ తరవాత అన్ని ప్రభుత్వశాఖల కార్యాలయాలు పరిమిత సిబ్బందితో తిరిగి ప్రారంభించారు. కానీ కరోనా ఉదృతి పెరగటంతో ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్ళడానికి జంకుతున్నారు.

ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉద్యోగుల భద్రత విషయంలో నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కరో వైరస్ సోకి మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు కరోనా భారిన పడ్డారని అధికారులు వివరించారు. మిగతా ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చేందుకు జంకుతున్నారని తెలిపారు. ఎలాంటి లక్షణాలు లేని ఉద్యోగుల్లో ధైర్యాన్ని నింపేందుకు మమతా సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.

You might also like